ప్రపంచ తల గాయాల దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో వి ఆర్ హై స్కూల్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు ప్రజలకు తల గాయాల ప్రమాదాలు వివరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. ప్రమాదం తర్వాత “గోల్డెన్ అవర్”లో చికిత్స కీలకమని తెలిపారు. డ్రైవింగ్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


