శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ ఎస్ఐ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమికూడకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అలజడులు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేపట్టినట్లు ఎస్ఐ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

శ్రీకాళహస్తిలో పరీక్షా కేంద్రాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న పోలీసులు