కొట్రా గ్రామ శివారులో శ్రీశైలం హైవే పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
తేదీ 08-03-2026 రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో, ఎరకుల ఎరకుల బాలకృష్ణ తండ్రి బాలరాజు (వయస్సు 28 సంవత్సరాలు) నివాసం జనచైతన్య కాలనీ, తుర్కాయాంజల్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నం. TG-07-R-6502 ను అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడిపి తుర్కాయాంజల్ వద్ద బావర్చి హోటల్ సమీపంలో ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న మనోజ్ మరియు మంజునాథ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషయమై 09-03-2026 తేదీన ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐ శ్రీ. సైదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి 10-03-2026 తేదీన నిందితుడు ఎరకుల బాలకృష్ణ పోలీస్ స్టేషన్‌కు హాజరైనపుడు కేసుకు సంబంధించిన నోటీసు ఇవ్వబడింది. అనంతరం తాను మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని భావించి తీవ్ర మనస్తాపానికి గురైన ఎరకుల బాలకృష్ణ తేదీ 11-03-2026 తేదీన మధ్యాహ్నం సమయంలో “నేను చనిపోతున్నాను” అని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి, ఫోన్ కాల్స్ కు స్పందించలేదు. దీంతో అతని భార్య ఎరకుల శ్రావణి 100 కాల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు సాయంత్రం సుమారు 5.30 గంటలకు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎస్.ఐ శ్రీ. సైదయ్య దర్యాప్తు చేపట్టారు.
తదుపరి విచారణలో, తేదీ: 12-03-2026 ఉదయం 8-30 గంటలకు ఎరకుల బాలరాజు కొట్రా గ్రామ శివారులో శ్రీశైలం హైవే పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి బాలరాజు ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాధమిక సమాచారం మేరకు మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని భావించి, తీవ్ర మనస్తాపానికి గురైన మృతుడు ఎరకుల బాలకృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియుచున్నది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేయబడును.



