శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో వెలసిన శ్రీ నల్ల గంగమ్మ తల్లి జాతర బుధవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న శ్రీవాణి రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శ్రీవాణి రెడ్డి ప్రారంభించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు గుణ, కళ్యాణి, వళ్లం గోపి, ప్రకాష్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వైభవంగా శ్రీ నల్ల గంగమ్మ జాతర-అమ్మవారిని దర్శించుకున్న బియ్యపు శ్రీవాణి రెడ్డి