Wednesday, 11 March 2026
  • Home  
  • లిఫ్ట్ అడిగి కాలయముడి కారు ఎక్కాడు: రోడ్డు ప్రమాదంలో బట్టల వ్యాపారి మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లిఫ్ట్ అడిగి కాలయముడి కారు ఎక్కాడు: రోడ్డు ప్రమాదంలో బట్టల వ్యాపారి మృతి

​దత్తలూరు/పామూరు: 11-3-2026 అపరిచితులను నమ్మి లిఫ్ట్ అడగడం ఆ వ్యాపారి ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రి వేళ గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత అనంత లోకాలకు పంపింది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఉదయగిరిలో బట్టల షాపు నడుపుకునే షాంషీర్ (వ్యాపారి) అక్కడికక్కడే మృతి చెందారు. ​అసలేం జరిగిందంటే? ​ఉదయగిరిలో బట్టల వ్యాపారం చేసుకునే షంషార్ వ్యక్తిగత పనిపై దత్తలూరు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి పామూరు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో దత్తలూరు వద్ద వేచి చూస్తుండగా, అదే దారిలో వెళ్తున్న ఒక కారును లిఫ్ట్ అడిగారు. కారు యజమాని అతడిని ఎక్కించుకుని పామూరు వైపు బయలుదేరారు., ​కారు దత్తలూరు సమీపంలోని తెడ్డుపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. అతివేగం కారణంగానో లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షంషార్ ఘటనా స్థలంలోనే మరణించారు. స్థానిక పోలీస్ సంఘటన స్థలనికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

​దత్తలూరు/పామూరు:
11-3-2026
అపరిచితులను నమ్మి లిఫ్ట్ అడగడం ఆ వ్యాపారి ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రి వేళ గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత అనంత లోకాలకు పంపింది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఉదయగిరిలో బట్టల షాపు నడుపుకునే షాంషీర్ (వ్యాపారి) అక్కడికక్కడే మృతి చెందారు.
​అసలేం జరిగిందంటే?
​ఉదయగిరిలో బట్టల వ్యాపారం చేసుకునే షంషార్ వ్యక్తిగత పనిపై దత్తలూరు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి పామూరు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో దత్తలూరు వద్ద వేచి చూస్తుండగా, అదే దారిలో వెళ్తున్న ఒక కారును లిఫ్ట్ అడిగారు. కారు యజమాని అతడిని ఎక్కించుకుని పామూరు వైపు బయలుదేరారు.,
​కారు దత్తలూరు సమీపంలోని తెడ్డుపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. అతివేగం కారణంగానో లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షంషార్ ఘటనా స్థలంలోనే మరణించారు.
స్థానిక పోలీస్ సంఘటన స్థలనికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.