ముస్తాబాద్/ మార్చి/పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస భక్షపతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గీస భక్షపతి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త అని అన్నారు. ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగావ్‌లో జన్మించారని తెలిపారు. 9 ఏళ్ల వయస్సులో జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగి, భర్త ప్రోత్సాహంతో విద్యను అభ్యసించారని చెప్పారు.
1848లో పూణేలో బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించి మహిళల విద్య, సమానత్వం కోసం ఆమె జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. అలాగే వితంతు పునర్వివాహాలు,
అంటరానితనం నిర్మూలన కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 1897 మార్చి 10న ప్లేగు బాధితులకు సేవ చేస్తూ ఆమె మరణించడం ఆమె త్యాగానికి నిదర్శనమని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు


