Monday, 9 March 2026
  • Home  
  • తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఖమ్మం

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర గుడి లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి దంపతులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. అలాగే శ్రీవారి దివ్య ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఎంతో పవిత్రమైన అనుభూతిని కలిగించిందని భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్–2047 లక్ష్యంతో ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు .

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర గుడి లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి దంపతులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు.

అలాగే శ్రీవారి దివ్య ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఎంతో పవిత్రమైన అనుభూతిని కలిగించిందని భట్టి విక్రమార్క తెలిపారు.

అదేవిధంగా త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్–2047 లక్ష్యంతో ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.