Saturday, 7 March 2026
  • Home  
  • బహుళ కళల మహిళ (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

బహుళ కళల మహిళ (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

ప్రతి సంవత్సరం మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. 20వ శతాబ్దం ప్రారంభంలో యూరప్ మరియు ఉత్తర అమెరికాలో జరిగిన కార్మిక ఉద్యమాల నుండి మహిళా దినోత్సవం ఉద్భవించింది. మొదటి మహిళా దినోత్సవం 1911లో జరుపుకోగా 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గౌరవిస్తూ, లింగ సమానత్వం కోసం ఈ రోజును నిర్ణయించడం జరిగింది. “హక్కులు, న్యాయం, కార్యాచరణ అందరి మహిళలు మరియు బాలికల కోసం” అనేది ఐక్యరాజ్యసమితి 2026వ సంవత్సర థీమ్. లింగ వివక్షను అంతం చేయడం, మహిళల హక్కులయిన విద్య, ఓటు హక్కు, సమాన వేతనం పట్ల అవగాహన కల్పించడం మరియు సమాన అవకాశాలను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మహిళాశక్తిపై పాఠకుల కోసం … ఈ కవిత అమ్మాయి నుండి అమ్మ వరకు చెల్లి నుండి అక్క వరకు అమ్మ నుండి అవ్వ వరకు భార్య నుండి బామ్మ వరకు సరిగమల నుండి ఘుమఘుమల వరకు సంగీతం నుండి ఆహారామృతం వరకు చోదకం నుండి భోదకం వరకు రాజీయం నుండి జయం వరకు ప్రతిపక్షం నుండి అంతరిక్షం వరకు శిక్షణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు ఇంటి పని నుండి ఆ పని ఈ పని అని.. పని ఏదైనా సంభవమని తలచి తలచి వలచి వంశవృక్ష రక్షణలో నిత్య వసంత ఆమని మది మదిని మురిపించేమణి రూపాంతర పరిమళ మాలిక అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక ఆప్యాయతలు పంచే సంసార సారిక అనుబంధ విలువలకు దివ్యౌషధ మూలిక తరతరాల సుసంపన్న మాతృక మహిళ జీవిత మధుర జ్ఞాపిక బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక విధి క్రీడలో అనుసరణీయ భాగ్య రేఖ స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక బహుళ కళల మహిళగ విశ్వాంబిక *మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం *హి* – హితోక్తుల భావజాలానికి బలం *ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం కుటుంబ పుష్టికి ఆనంద భరితం గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం అవనిలో ధ్వనించే నిత్య జీవనగీతం.. మహిళ

ప్రతి సంవత్సరం మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. 20వ శతాబ్దం ప్రారంభంలో యూరప్ మరియు ఉత్తర అమెరికాలో జరిగిన కార్మిక ఉద్యమాల నుండి మహిళా దినోత్సవం ఉద్భవించింది. మొదటి మహిళా దినోత్సవం 1911లో జరుపుకోగా 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గౌరవిస్తూ, లింగ సమానత్వం కోసం ఈ రోజును నిర్ణయించడం జరిగింది. “హక్కులు, న్యాయం, కార్యాచరణ అందరి మహిళలు మరియు బాలికల కోసం” అనేది ఐక్యరాజ్యసమితి 2026వ సంవత్సర థీమ్. లింగ వివక్షను అంతం చేయడం, మహిళల హక్కులయిన విద్య, ఓటు హక్కు, సమాన వేతనం పట్ల అవగాహన కల్పించడం మరియు సమాన అవకాశాలను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మహిళాశక్తిపై పాఠకుల కోసం … ఈ కవిత

అమ్మాయి నుండి అమ్మ వరకు
చెల్లి నుండి అక్క వరకు
అమ్మ నుండి అవ్వ వరకు
భార్య నుండి బామ్మ వరకు

సరిగమల నుండి ఘుమఘుమల వరకు
సంగీతం నుండి ఆహారామృతం వరకు
చోదకం నుండి భోదకం వరకు

రాజీయం నుండి జయం వరకు
ప్రతిపక్షం నుండి అంతరిక్షం వరకు
శిక్షణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు

ఇంటి పని నుండి ఆ పని ఈ పని అని..
పని ఏదైనా సంభవమని
తలచి తలచి వలచి వంశవృక్ష రక్షణలో
నిత్య వసంత ఆమని
మది మదిని మురిపించేమణి

రూపాంతర పరిమళ మాలిక
అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక
ఆప్యాయతలు పంచే సంసార సారిక

అనుబంధ విలువలకు దివ్యౌషధ మూలిక
తరతరాల సుసంపన్న మాతృక
మహిళ జీవిత మధుర జ్ఞాపిక

బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక
విధి క్రీడలో అనుసరణీయ భాగ్య రేఖ
స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక

బహుళ కళల మహిళగ విశ్వాంబిక
*మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం
*హి* – హితోక్తుల భావజాలానికి బలం
*ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం

కుటుంబ పుష్టికి ఆనంద భరితం
గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం
అవనిలో ధ్వనించే నిత్య జీవనగీతం.. మహిళ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.