రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి /పున్నమి ప్రతినిధి
2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు నామాపూర్ TG మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. కొండల్ రెడ్డి తెలిపారు.
ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ మోడల్ స్కూల్‌లలో నాణ్యమైన విద్యతో పాటు మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత మోడల్ స్కూల్‌ను సంప్రదించాలని సూచించారు.


