అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 25 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్):
ఎలమంచిలి మండలం పరిధిలోని రూరల్ గ్రామమైన గుండ్రుబిల్లిలో అభివృద్ధికి నాంది పలుకుతూ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి చొరవతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రెండు రోజుల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వేయించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎపీపీ రాజన్న శేషు గారు, వైస్ ఎంఎపీపీ నాగిరెడ్డి అచ్చినాయుడు గారు, గుండ్రుబిల్లి గ్రామ అధ్యక్షుడు వై. మాణిక్యం గారు, జనసేన పార్టీ నాయకులు సర్వసూది హరికృష్ణ గారు, కురందాసు శ్రీనివాసు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎలమంచిలి రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జీ గారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే చూపుతున్న కట్టుబాటు అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామ స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి పనులతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.



