ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం భూదాన్ కాలనీలో గత 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలను ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా గెంటివేయడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు. అసలైన పేదలకు న్యాయం జరగాల్సిందేనని, వారికి ఇళ్ల హక్కు కల్పించేవరకు బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇళ్లు కోల్పోయి ప్రస్తుతం ఖమ్మం నగరంలోని Ambedkar Bhavan లో తలదాచుకుంటున్న బాధితులను దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ ప్రతి నిధి బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి తీసుకొనేందుకు నాయకులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ, పేదలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్యాయమని, ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అమానుష చర్య అని విమర్శించారు. బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, అసలైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అసలైన పేదలకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు భరోసా ఇచ్చారు.
కార్యక్రమం లో రాజేష్ గుప్తా, రవి రాదోడ్, నరేష్, రామ కృష్ణ, అల్లిక అంజయ్య, రాఘవ రావు, గుత్త వంశీ, విజయరాజు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు



