స్వయంగా నిర్వహించిన ట్రస్టు చైర్మన్ MRR
తిరుపతి రూరల్, పిబ్రవరి 18 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. నేడు పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.


