Wednesday, 18 February 2026
  • Home  
  • కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి.*
- తిరుపతి

కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి.*

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. కమిషనర్ ఎన్. మౌర్య. తిరుపతి ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్ష(రీసర్వే), పారిశుధ్థ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్ధిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్ష (రీసర్వే) పనులను గడువు లోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బి.పిఎస్, ఎల్.ఆర్.ఎస్., దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుధ్థ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్సులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు,ఏసీపి లు, తదితరులు పాల్గొన్నారు.

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి.

కమిషనర్ ఎన్. మౌర్య.
తిరుపతి ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి

ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్ష(రీసర్వే), పారిశుధ్థ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్ధిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్ష (రీసర్వే) పనులను గడువు లోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బి.పిఎస్, ఎల్.ఆర్.ఎస్., దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుధ్థ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్సులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు,ఏసీపి లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.