Wednesday, 18 February 2026
  • Home  
  • కల్లూరు మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక:
- ఖమ్మం

కల్లూరు మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. మున్సిపల్ సమావేశంలో సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా మోహన్ నాయక్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరి ఎంపికయ్యారు. ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘమయి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా నూతన చైర్మన్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి లకు అభినందనలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించి పని చేయాలని ఆకాంక్షించారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. మున్సిపల్ సమావేశంలో సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా మోహన్ నాయక్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరి ఎంపికయ్యారు.

ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘమయి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా నూతన చైర్మన్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి లకు అభినందనలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించి పని చేయాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.