Wednesday, 18 February 2026
  • Home  
  • వైరా మున్సిపల్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
- ఖమ్మం

వైరా మున్సిపల్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) వైరా మున్సిపాలిటీలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మున్సిపల్ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా డాక్టర్ శ్రీమతి కాపా చంద్ర కళ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కట్ల సంతోష్ ఎంపికయ్యారు. ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యులు మాలోత్ రామ్ దాస్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ డాక్టర్ కాపా చంద్ర కళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

వైరా మున్సిపాలిటీలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మున్సిపల్ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా డాక్టర్ శ్రీమతి కాపా చంద్ర కళ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కట్ల సంతోష్ ఎంపికయ్యారు.

ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యులు మాలోత్ రామ్ దాస్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ డాక్టర్ కాపా చంద్ర కళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.