తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తాళ్లపూడిలో ఆటో డ్రైవర్లతో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలు భారీగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కొవ్వూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ కే శివ ప్రసాద్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటోలలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన అదనపు ప్యాసింజర్లను కూర్చోబెట్టరాదని స్పష్టం చేశారు.
ప్రతి ఆటోకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా డ్రైవర్లు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను కాపాడటం ప్రతి డ్రైవర్ బాధ్యత అని స్పష్టం చేశారు.

మహాశివరాత్రి వేళ ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యం – తాళ్లపూడి ఆటో డ్రైవర్లకు ఆర్టీఏ కఠిన హెచ్చరిక
తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తాళ్లపూడిలో ఆటో డ్రైవర్లతో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలు భారీగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ కే శివ ప్రసాద్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటోలలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన అదనపు ప్యాసింజర్లను కూర్చోబెట్టరాదని స్పష్టం చేశారు. ప్రతి ఆటోకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా డ్రైవర్లు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను కాపాడటం ప్రతి డ్రైవర్ బాధ్యత అని స్పష్టం చేశారు.

