Thursday, 12 February 2026
  • Home  
  • అసెంబ్లీలో శ్రీకాళహస్తి సమస్యలపై గళంవిప్పిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

అసెంబ్లీలో శ్రీకాళహస్తి సమస్యలపై గళంవిప్పిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన కీలక సమస్యలపై బలంగా గళం విప్పారు. ముఖ్యంగా మూడు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మొదటది శ్రీకాళహస్తిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిరోజూ తిరుమలకి విచ్చేసే భక్తుల్లో సగం మంది శ్రీకాళహస్తి దర్శనార్థం వస్తున్నారని పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. రెండవ అంశం శ్రీకాళహస్తి ఆలయంలో సుమారు 1100 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించి, న్యాయం చేయాలని కోరారు. తిరుమల, శ్రీశైలం వంటి దేవాలయాలు ఆసుపత్రులను నిర్వహిస్తున్న విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, శ్రీకాళహస్తిలో ఉన్న ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆలయంతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని ఆలయ ఆదాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అభిప్రాయపడ్డారు. మూడవ అంశంగా, 22A చట్టం కారణంగా పేదలు, రైతులు, పట్టాదారులు తమ సొంత భూములపై హక్కులు వినియోగించుకోలేకపోతున్నారని గత పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని 22A చట్టాన్ని సవరించి, అర్హులైన వారికి ఇంటి స్థలాలు, పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రిని కోరారు. శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గట్టిగా గళం విప్పడం గమనార్హం.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన కీలక సమస్యలపై బలంగా గళం విప్పారు. ముఖ్యంగా మూడు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మొదటది శ్రీకాళహస్తిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిరోజూ తిరుమలకి విచ్చేసే భక్తుల్లో సగం మంది శ్రీకాళహస్తి దర్శనార్థం వస్తున్నారని పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రెండవ అంశం శ్రీకాళహస్తి ఆలయంలో సుమారు 1100 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించి, న్యాయం చేయాలని కోరారు. తిరుమల, శ్రీశైలం వంటి దేవాలయాలు ఆసుపత్రులను నిర్వహిస్తున్న విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, శ్రీకాళహస్తిలో ఉన్న ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆలయంతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని ఆలయ ఆదాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అభిప్రాయపడ్డారు.
మూడవ అంశంగా, 22A చట్టం కారణంగా పేదలు, రైతులు, పట్టాదారులు తమ సొంత భూములపై హక్కులు వినియోగించుకోలేకపోతున్నారని గత పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని 22A చట్టాన్ని సవరించి, అర్హులైన వారికి ఇంటి స్థలాలు, పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రిని కోరారు. శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గట్టిగా గళం విప్పడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.