శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ వైసీపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అలజడులు సృష్టించాలని చూస్తున్న కొంతమంది జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులం, మతం, ప్రాంతాన్ని వాడుతూ మనమధ్య విభజన తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే కుతంత్రాలను ప్రజలకు తెలియ పరచి వైసిపి యొక్క అరాచక సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకలించి సమూలంగా నాశనం చేయడానికి ప్రతీ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికుడిలా క్రమశిక్షణతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసినప్పుడు సూచించారని కిషోర్ తెలిపారు. వైసిపి మూకలు చేస్తున్న తప్పులను, పాపాలను కులాలకు ఆపాదించాలనుకుంటే, దానిని ఏ కులమూ ఒప్పుకోదని, స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కాపులకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీయే అని, తెలుగుదేశం పార్టీ నిరంతరం కాపుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని, ఇది ఒక నినాదం మాత్రమే కాదు, ఒక చరిత్ర అనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి కానీ, అతని అనుచరులు గాని ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కాపులని, టీడీపీ నుంచి దూరం చేయలేరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డూల్లో కల్తీ నెయ్యి కలపడమే మహా పాపం, మళ్లీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారంతో ప్రజల దృష్టి మరల్చడానికి అంబటి, జోగి లాంటి వ్యక్తుల చేత జగన్ వీధి నాటకాలు వేయిస్తున్నాడని, దీనిని ప్రజలు నమ్మరని బూతులు మాట్లాడుతూ, రౌడీయిజం చేస్తూ, మేము అనుకున్నదే ప్రజలు వినాలి, చూడాలి అంటే, చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరని…. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అని, తోక జాడించే ఆకు రౌడీలను అధః పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు.

దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి- తెదేపా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్