ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో విజయవాడ లోని లోక్ భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తేనేటి విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, యువ రచయిత, కవిరాజు మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళీమోహన్ రాజును గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చిత్రపటాన్ని మురళీమోహన్ రాజు చేతులమీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

గవర్నర్ చిత్రపటాన్ని బహూకరించిన మురళీమోహన్ రాజు