కామారెడ్డి, 23 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండా గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఇది కేవలం ఒక భవనం కాదు – గ్రామ పరిపాలనకు, ప్రజా సేవలకు రివల్యూషనరీ స్టెప్, గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి నేతృత్వంలో ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ కిక్‌ఆఫ్ అయింది.ఈ ఘన కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగావత్ రమేష్, తండా కరోబారీ గంగావత్ రవీం దర్ ప్రధాన పాత్ర పోషించారు. వార్డు సభ్యులు – గంగావత్ సేవ్య, గంగావత్ సంతోష్, బుక్య సరిత, గంగావత్ సుజాత, గంగావత్ భూలి, సలావత్ లలిత, సలావత్ తిరుపతి – అందరూ ఎనర్జిటిక్ గా పాల్గొన్నారు. గ్రామ సెక్రెటరీ అధికారికంగా కో-ఆర్డినేట్ చేసి, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక పండితులు వేద మంత్రోచ్చారణలు చేసి, భూమి పూజలు ఘనంగా జరిపారు. సర్పంచ్ బుచ్చిరెడ్డి మొదటి రాయి పట్టి పుణాదిని ప్రారంబించారు. ఈ భవనం మా గ్రామ పరిపాలనకు కొత్త డాక్యు మెంట్ అవుతుందన్నారు. ప్రజల సమస్యలు ఇక సాల్వ్ అయ్యేలా సూపర్ ఫెసిలిటీలు అని ప్రకటిం చారు. ఉపసర్పంచ్ రమేష్ మాట్లాడుతూ,ఇది మా టీమ్ వర్క్ ఫలితం. గ్రామ అభివృద్ధికి మైలురా యి అని అన్నారు.ఈ నూతన పంచాయతీ భవ నం మోడరన్ డిజైన్‌తో రానుందన్నారు. సమావేశా ల హాల్, డిజిటల్ రికార్డ్స్ రూమ్, ప్రజా గ్రీవెన్స్ కౌంటర్‌లు, సిస్టమ్ సహా అన్ని అడ్వాన్స్ ఫీచర్స్. ఇది గ్రామంలో పెండింగ్ వర్క్‌లు ఫాస్ట్ ట్రాక్ చేస్తుం దని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, సర్వేలు అండ్ వాటర్ స్కీమ్స్ సూపర్ ఈజీగా అవుతాయ న్నారు. గ్రామ ప్రజలు సంతోషంగా చెప్పుకుంటు న్నారు.వార్డు సభ్యులు ప్రజలతో అనుసంధానం అయి, ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.ఈ భూమి పూజ గ్రామంలో ఉత్సవ వాతావరణం సృష్టించింది.ఈ భవనం తండా గ్రామాన్ని మోడల్ పంచాయతీగా మార్చుతుందని నమ్మకం గ్రామాభివృద్ధికి జై హో!
అని నినాదాలు చేశారు. .


