ఇల్లంతకుంట/పున్నమి ప్రతినిధి/ జనవరి 22
పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణి చేసిన గొల్లపల్లి మరియు వెంకట్రావ్ పల్లె సర్పంచ్ లు రడం లక్ష్మి (ప్రవీణ్ )చల్ల నవీన్ రెడ్డి నేడు ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యునఫామ్ లు షూస్ మరియు అబకాస్ బుక్స్ గౌరవ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్ ) మరియు సర్పంచ్ నవీన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ లక్ష్మి(ప్రవీణ్ ), చల్ల నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదుగాలని అన్నారు.మన గ్రామంలోని పాఠశాలకు మా వంతు సహాయాసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సతీష్, ఇరు గ్రామాల ఉప సర్పంచ్ లు ఓరుపుల లక్ష్మన్, అనగోని అవినాష్, వార్డ్ సభ్యులు పత్రీ అంజయ్య, ముద్దాల అజయ్,మంద అనిల్ ,మంద రాజు, ఓరుపుల చంద్రయ్య, ఎద్దు భూమయ్య, చిగుర్ల అనిల్ రడం విజయ్, ఓరుపుల వంశీ, ఉపాధ్యాయులు, విద్యార్థులతల్లితండ్రులు,తదితరులు పాల్గొన్నారు



