అనకాపల్లి జిల్లా, జనవరి 18 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్):
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎలమంచిలి రూరల్ మండలం కొత్తలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇత్తంశెట్టి రాజా వెంకట రమణారావు, ఎలమంచిలి మాజీ ఎంపీపీ, ప్రస్తుత పిఎసిఎస్ చైర్మన్ కొలుకులూరి విజయరామరాజు పాల్గొని ఎన్టీఆర్ ప్రజాస్వామ్యానికి చేసిన సేవలను స్మరించారు.
మండల పార్టీ అధ్యక్షులు నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, మండల క్లస్టర్ ఇంచార్జ్ వూడి రామకృష్ణ, ఎక్స్ వైస్ ఎంపీపీ గొన్నబత్తులు శేషు, ఎక్స్ సర్పంచ్ గంజి శ్రీను, ఎడ్ల చిన్న బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల హాజరుతో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యమని నేతలు తెలిపారు.



