జనవరి 6అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామంలో భూమి పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి మండలం ఎంపీపీ రాజన్న శేషు గారు హాజరై అర్హులైన రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి కుమారుడు శ్రీను, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, వైస్ సర్పంచ్ కర్రీ సమాచారం, వార్డ్ మెంబర్స్ నాయుడు మాస్టారు, శ్రీను పాల్గొన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.



