Thursday, 26 March 2026
  • Home  
  • భవిత స్కూల్‌లో దివ్యాంగ విద్యార్థులకు అండగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
- విశాఖపట్నం

భవిత స్కూల్‌లో దివ్యాంగ విద్యార్థులకు అండగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

విశాఖ గాజువాక , జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని భవిత స్కూల్‌లో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదురు గోవింద్‌తో పాటు బంధుమిత్రుల సహకారంతో భవిత స్కూల్‌లో చదువుతున్న మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఏడాదిలో ఒక రోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం, వారి తల్లిదండ్రులకు బట్టలు పంపిణీ చేయడం ప్రశంసనీయమైన సేవా కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. ఈ సేవల వల్ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడుపుట్ల శ్రీను, ఈ.అప్పలరాజు, బి.రవి, వై.కొండబాబు, గోవింద్, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విశాఖ గాజువాక , జనవరి (పున్నమి ప్రతినిధి)

గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని భవిత స్కూల్‌లో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదురు గోవింద్‌తో పాటు బంధుమిత్రుల సహకారంతో భవిత స్కూల్‌లో చదువుతున్న మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఏడాదిలో ఒక రోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం, వారి తల్లిదండ్రులకు బట్టలు పంపిణీ చేయడం ప్రశంసనీయమైన సేవా కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. ఈ సేవల వల్ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడుపుట్ల శ్రీను, ఈ.అప్పలరాజు, బి.రవి, వై.కొండబాబు, గోవింద్, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.