*ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు*
నూతన ఏడాది సందర్భంగా పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని పలమనేరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ మరియు పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా ఆదివారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఎమ్మెల్యేను కలసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఆర్వో నారాయణ తో పాటు ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు, ఎలిఫెంట్ ట్రాకర్స్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిదంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతా రాణి, డైరెక్టర్ లు నాగరాజు, సుధాకర్ లతో పాటు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.



