Monday, 30 March 2026
  • Home  
  • *తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం* *అబద్ధాలతో భక్తుల విశ్వాసాలపై దాడి* : *వేమూరి ఆనంద్ సూర్య*
- ఎన్ టి ఆర్ జిల్లా

*తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం* *అబద్ధాలతో భక్తుల విశ్వాసాలపై దాడి* : *వేమూరి ఆనంద్ సూర్య*

తిరుమలతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల పవిత్రతను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అయినా ‘తొక్కిసలాట’, ‘ప్రభుత్వ నిర్లక్ష్యం’ అంటూ వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు.తిరుమలలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్వయంగా ఎస్పీ పరిశీలించి స్పష్టం చేసినప్పటికీ, భయాందోళన సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నా యని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలోనే ఆలయాలపై దోపిడీలు, అక్రమాలు జరిగాయని,ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తోందన్నారు. తిరుమల గోశాల, నిత్యాన్నదానం, దర్శనాలపై తప్పుడు వదంతులు పుట్టించి భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. ఆలయాలపై దుష్ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయా లనే కుట్రగా ఆయన అభివర్ణించారు.

తిరుమలతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల పవిత్రతను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అయినా ‘తొక్కిసలాట’, ‘ప్రభుత్వ నిర్లక్ష్యం’ అంటూ వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు.తిరుమలలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్వయంగా ఎస్పీ పరిశీలించి స్పష్టం చేసినప్పటికీ, భయాందోళన సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నా యని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలోనే ఆలయాలపై దోపిడీలు, అక్రమాలు జరిగాయని,ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తోందన్నారు.
తిరుమల గోశాల, నిత్యాన్నదానం, దర్శనాలపై తప్పుడు వదంతులు పుట్టించి భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. ఆలయాలపై దుష్ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయా లనే కుట్రగా ఆయన అభివర్ణించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.