Thursday, 2 April 2026
  • Home  
  • గిరిజన మండలానికి అంబులెన్సు 108 ఎందుకు లేదు?
- కామారెడ్డి

గిరిజన మండలానికి అంబులెన్సు 108 ఎందుకు లేదు?

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి. : జిల్లా అధికారులకు మత్తు వీడలేదా !! గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం?? కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలానికి ఇప్పటికీ ఒక్క 108 సర్వీ స్ అంబులెన్స్ తటస్థంగా లేకపో వడం, ప్రత్యేకంగా గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం అని స్థానికులు మండి పడుతు న్నారు.తెలంగాణ వ్యాప్తంగా 108 అత్యవసర అంబులెన్సుల దళం 400కుపైగా వాహనాలతో, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక బైక్ అంబులెన్సు లు కూడా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కొత్తగా జోడించిన అంబులెన్సుల్లో పలు ట్రైబల్ జోన్లు, సేవలు లేని రూరల్ మండలా లకు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతుండగా, రామారెడ్డికి మాత్రం ఇంకా 108 నోచుకోకపోవడం జిల్లా అధికారుల మొండి వైఖరి ని బహిర్గతం చేస్తోంది. కాగితాలపై వాగ్దానాలు – నేలమీద ఖాళీ ప్రాంగణం 108 అంబులెన్స్ ఎక్కడ చేరక ముందే ‘గోల్డెన్ అవర్’లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రకటించగా, రామారెడ్డి మండలంలో అయితే ఫ్రిజ్ శవపేటికే దవాఖాన అంచులో మూలన పడి పోయింది.వైకుంఠ రథంగా వాడాల్సిన ఫ్రిజ్ శవ పేటిక ఇలా గడ్డి మధ్య పడి తుప్పు పట్టిపోతుండ గా, గ్రామీణ పేదలకు మాత్రం అత్యవసర అంబులె న్స్ దొరకక ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 108 సేవ లక్ష్యం – రామారెడ్డిలో విఫలమా? డయల్ 108 దేశవ్యాప్త అత్యవసర నంబర్, వైద్య, అగ్ని, పోలీస్ వంటి పరిస్థితుల్లో ఉచితంగా స్పం దించి, ప్రాథమిక–అధునాతన చికిత్సతో రోగిని సమీప ఆసుపత్రికి తరలించడమే దీని లక్ష్యం అని మార్గదర్శకాలు చెబుతున్నాప్పటినీ రామారెడ్డి మండలానికి ప్రత్యేక 108 వాహనం కేటాయించక పోవడం వల్ల ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్‌లు, గర్భిణీ పేషంట్లకు సమయానికి వైద్యం చేరే అవకాశం కోల్పోతున్నారని స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నా యి.“గిరిజన పల్లెల ప్రాణాలు తక్కువా?” ప్రజల ప్రశ్న? రామారెడ్డి మండలంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వారిని అత్యవసర వైద్య సేవల చట్రం నుంచి బయట పెట్టడం ఏ న్యాయం అని యువజన సంఘాలు, గ్రామ కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని ఇతర మండలాలకు 108లు, బైక్ అంబులెన్సులు ఇవ్వగలిగిన అదే ప్రభుత్వం, రామారెడ్డిని బేస్‌గా తీసుకొని ప్రత్యేక అంబులెన్స్, ఫ్రిజ్ శవపేటిక, వైకుంఠ రథం ఎప్పటి నుంచి అందుబాటులో పెడతారో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు సవాల్ – డెడ్ బాడీ కాదు, లైవ్ పేషంట్‌ని కాపాడండి దవాఖాన ఆవరణలో మూలన పడి ఉన్న ఫ్రిజ్ శవపేటిక, చెత్తపాలు అయిన వైద్య సామాను కంటే, బతికే పేషంట్లను కాపాడే 108 సేవ ముఖ్యం అని ప్రజలు హెచ్చరిక ఇస్తున్నారు.రామారెడ్డి మండలానికి వెంటనే ఒక పూర్తి స్థాయి108 అంబు లెన్స్, అదనంగా ట్రైబల్ పల్లెల కోసం బైక్ అంబు లెన్సులు కేటాయించి, డ్రైవర్ (EMT )పోస్టులు భర్తీ చేసి, సేవలు ప్రారంభించే వరకు ప్రజా ఉద్య మం కొనసాగుతుందని గ్రామ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి. :

జిల్లా అధికారులకు మత్తు వీడలేదా !!

గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం??

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలానికి ఇప్పటికీ ఒక్క 108 సర్వీ స్ అంబులెన్స్ తటస్థంగా లేకపో వడం, ప్రత్యేకంగా గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం అని స్థానికులు మండి పడుతు న్నారు.తెలంగాణ వ్యాప్తంగా 108 అత్యవసర అంబులెన్సుల దళం 400కుపైగా వాహనాలతో, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక బైక్ అంబులెన్సు లు కూడా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కొత్తగా జోడించిన అంబులెన్సుల్లో పలు ట్రైబల్ జోన్లు, సేవలు లేని రూరల్ మండలా లకు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతుండగా, రామారెడ్డికి మాత్రం ఇంకా 108 నోచుకోకపోవడం జిల్లా అధికారుల మొండి వైఖరి ని బహిర్గతం చేస్తోంది.

కాగితాలపై వాగ్దానాలు – నేలమీద ఖాళీ ప్రాంగణం

108 అంబులెన్స్ ఎక్కడ చేరక ముందే ‘గోల్డెన్ అవర్’లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రకటించగా, రామారెడ్డి మండలంలో అయితే ఫ్రిజ్ శవపేటికే దవాఖాన అంచులో మూలన పడి పోయింది.వైకుంఠ రథంగా వాడాల్సిన ఫ్రిజ్ శవ పేటిక ఇలా గడ్డి మధ్య పడి తుప్పు పట్టిపోతుండ గా, గ్రామీణ పేదలకు మాత్రం అత్యవసర అంబులె న్స్ దొరకక ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

108 సేవ లక్ష్యం – రామారెడ్డిలో విఫలమా?

డయల్ 108 దేశవ్యాప్త అత్యవసర నంబర్, వైద్య, అగ్ని, పోలీస్ వంటి పరిస్థితుల్లో ఉచితంగా స్పం దించి, ప్రాథమిక–అధునాతన చికిత్సతో రోగిని సమీప ఆసుపత్రికి తరలించడమే దీని లక్ష్యం అని మార్గదర్శకాలు చెబుతున్నాప్పటినీ రామారెడ్డి మండలానికి ప్రత్యేక 108 వాహనం కేటాయించక పోవడం వల్ల ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్‌లు, గర్భిణీ పేషంట్లకు సమయానికి వైద్యం చేరే అవకాశం కోల్పోతున్నారని స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నా యి.“గిరిజన పల్లెల ప్రాణాలు తక్కువా?” ప్రజల ప్రశ్న? రామారెడ్డి మండలంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వారిని అత్యవసర వైద్య సేవల చట్రం నుంచి బయట పెట్టడం ఏ న్యాయం అని యువజన సంఘాలు, గ్రామ కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని ఇతర మండలాలకు 108లు, బైక్ అంబులెన్సులు ఇవ్వగలిగిన అదే ప్రభుత్వం, రామారెడ్డిని బేస్‌గా తీసుకొని ప్రత్యేక అంబులెన్స్, ఫ్రిజ్ శవపేటిక, వైకుంఠ రథం ఎప్పటి నుంచి అందుబాటులో పెడతారో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులకు సవాల్ – డెడ్ బాడీ కాదు, లైవ్ పేషంట్‌ని కాపాడండి

దవాఖాన ఆవరణలో మూలన పడి ఉన్న ఫ్రిజ్ శవపేటిక, చెత్తపాలు అయిన వైద్య సామాను కంటే, బతికే పేషంట్లను కాపాడే 108 సేవ ముఖ్యం అని ప్రజలు హెచ్చరిక ఇస్తున్నారు.రామారెడ్డి మండలానికి వెంటనే ఒక పూర్తి స్థాయి108 అంబు లెన్స్, అదనంగా ట్రైబల్ పల్లెల కోసం బైక్ అంబు లెన్సులు కేటాయించి, డ్రైవర్ (EMT )పోస్టులు భర్తీ చేసి, సేవలు ప్రారంభించే వరకు ప్రజా ఉద్య మం కొనసాగుతుందని గ్రామ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.