గూడెంకొత్తవీధి–ధారకొండ:
గూడెంకొత్తవీధి–ధారకొండ అంతర్రాష్ట్ర రహదారిలో ప్రయాణం ప్రయాణికులకు భయంగా మారుతోంది. గతంలో దారిదోపిడీలు, చిరుత సంచారం వంటి ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇప్పుడు రోడ్డుపై వాలిపోయిన ముళ్ల చెట్టు కొమ్మలు ముప్పుగా నిలుస్తున్నాయి. సంపెంగగొంది సమీపంలోని మలుపు వద్ద కొమ్మలు కనిపించక వాహనాలపై గీసుకుంటుండగా, కొందరు వాహనాదారులు అకస్మాత్తుగా ఆపే ప్రయత్నంలో పడిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ముళ్లకంపలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
రహదారిపై ముళ్లకంపల ముప్పు
గూడెంకొత్తవీధి–ధారకొండ: గూడెంకొత్తవీధి–ధారకొండ అంతర్రాష్ట్ర రహదారిలో ప్రయాణం ప్రయాణికులకు భయంగా మారుతోంది. గతంలో దారిదోపిడీలు, చిరుత సంచారం వంటి ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇప్పుడు రోడ్డుపై వాలిపోయిన ముళ్ల చెట్టు కొమ్మలు ముప్పుగా నిలుస్తున్నాయి. సంపెంగగొంది సమీపంలోని మలుపు వద్ద కొమ్మలు కనిపించక వాహనాలపై గీసుకుంటుండగా, కొందరు వాహనాదారులు అకస్మాత్తుగా ఆపే ప్రయత్నంలో పడిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ముళ్లకంపలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

