గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ఎపికా గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలు నృత్య ప్రదర్శన మరియు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, రౌతు శ్రీనివాసరావు, క్రైస్తవ ప్రతినిధులు బిల్లీగ్రామ్, లక్ష్మీనారాయణ, అశోక్ బాబు, మోహన్ రావు, గాజువాక సీఐ పార్థసారథి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చ విజయకుమార్, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పెంటయ్య, చెరుకూరి నాగేశ్వరరావు, సింగూరి అనంత్, నిర్మల కుమారి, అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.


