కామారెడ్డి,21 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి ఘన విజయం సాధించిన పిప్పరి లింబాద్రి చిన్ననాటి మిత్రులు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ మాస్ విజయాన్ని జరుపుకుని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం సన్నిధిలో ఘన కార్యక్రమం నిర్వహించారు.ఈ ఉత్సవంలో చిన్ననాటి మిత్రు లైన సామాల గణపతి, నామాల గంగాధర్, గొల్లపల్లి లక్ష్మా గౌడ్, పొట్టిగారి దేవేందర్, కుకుట్ల శ్రీనివాస్, శివరాం బాలగౌడ్, సుప్పని గంగాధర్, సంగీ గంగాధర్, బుద్దల రాజయ్య, జిల్లా శశిభూ షణ్ పాల్గొని సన్మానించారు. ముందుగా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు.ఈ ఘన కార్యక్రమం స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని జరుపుకునే మరో మైలురాయిగా నిలిచింది.


