ప్రజా ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించండి.
– జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి
*విశాఖపట్నo డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి. జె. ఆర్. ఎస్) లోని ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో పి. జె. ఆర్. ఎస్ పై జీవీఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ ఎస్. ఎస్. వర్మ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ. ఎన్. వి. నరేష్ కుమార్ లతోపాటు అన్ని జోన్ల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్ విభాగం, పరిపాలన విభాగం, రెవెన్యూ, ప్రజా ఆరోగ్యం విభాగం, ఆర్టికల్చర్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశ నిర్వహణ పాటు కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన పి.జె.ఆర్.ఎస్ ఫ్రీ ఆడిటర్లు సిహెచ్. ప్రసాద్,
వి. సూర్య కిరణ్ లతో ఆర్జీలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల కొరకు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి. జె.ఆర్.ఎస్) లోని ప్రజలు పెట్టుకున్న ఫిర్యాదులు/ ఆర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు తమ లాగిన్ లో 24 గంటలకు మించి ఉంచరాదని, మొదటగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదుదారుడు సంతృప్తి చెంది, సమస్య పరిష్కరించిన తర్వాతే అతనికి ఎండార్స్మెంట్ ఇచ్చిన పిదప ఫిర్యాదును క్లోజ్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుని సమస్య పూర్తిగా పరిష్కరించకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేయడం వలన మరల అదే ఫిర్యాదు రీఓపెన్ అవుతుందని తెలిపారు. ఫిర్యాదులపై సీఎంఓ కార్యాలయం ప్రత్యేక దృష్టి చారించిందని ఫిర్యాదులు పరిష్కరించకుండా క్లోజ్ చేస్తే చార్జ్ మెమో లు ఇవ్వడం జరుగుతుందని అదనపు కమిషనర్ హెచ్చరించారు.
అనంతరం అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పిజిఆర్ఎస్) రెండు రకాల ఫిర్యాదులు ఉంటాయని ఒకటి ఫైనాన్స్ రెండు నాన్ ఫైనాన్స్ సంబంధించినవని, నాన్ ఫైనాన్స్ కు సంబంధించి ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని, ఫైనాన్స్ సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతున్నందున ఫిర్యాదుదారుడు తో నేరుగా విషయం వారికి అర్థమయ్యేలా వివరించి, ఆ సమస్య ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలము వారికి తెలిపిన పిదప ఆ ఫిర్యాదుదారుడు మరల ఆ ఫిర్యాదును రీ ఓపెన్ చేయకుండా చూడాలని తెలిపారు.
అనంతరం కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన పి జే ఆర్ ఎస్ ఫ్రీ ఆడిటర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోని ఫిర్యాదులను ఏ విధంగా క్లోజ్ చేయాలన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారులు, రెవెన్యూ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, డిపిఓలు, ఏపీడీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


