శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, పట్టణంలోని నారాయణ పాఠశాలలో విజయ్ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్ మాట్లాడుతూ, భారతదేశం–పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిందని ఆయన వివరించారు. ఈ విజయం ద్వారా భారత సైన్యపు ధైర్యం, త్యాగం, వ్యూహాత్మక ప్రతిభ ప్రపంచానికి స్పష్టంగా తెలిసిందని పేర్కొన్నారు. విజయ్ దివాస్ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళి అర్పించే రోజుగా, భారత సైన్యం సాధించిన అత్యంత ఘన విజయాల్లో ఒకటిగా, దేశభక్తి, జాతీయ ఐక్యతను మరింత బలపరచే సందర్భంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నదని ఈశ్వర తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు భారత ఆర్మీ సైనికుల వేషధారణలో, అలాగే డాక్టర్లు, నర్సులు సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల వేషధారణలో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు