నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు
* జీవీఎంసీ పరిధిలో మంగళవారం 281 ఆక్రమణల తొలగింపు.
*
– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు
*విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 281 ఆక్రమణలను మంగళవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.
తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది.
1వ జోన్ పరిధిలో మంగమారిపేట నుండి భీమిలి బీచ్ రోడ్డు వరకు 13 ఆక్రమణలు,
2 వ జోన్ పరిధిలో కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు 18 ఆక్రమణలు,
3వ జోన్ పరిధిలో రామా టాకీస్ నుండి సత్యం జంక్షన్ వరకు, సత్యం జంక్షన్ నుండి ఏ ఎస్ ఆర్ విగ్రహం వరకు, ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ రోడ్డు నుండి పోర్ట్ స్టేడియం వరకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి గురుద్వార్ జంక్షన్ వరకు 83 ఆక్రమణలు,
4 వ జోన్ పరిధిలో అగర్వాల్ హాస్పిటల్ నుండి ఎస్టీ ఆంతోనీ స్కూల్ వరకు 33 ఆక్రమణలు,
5 వ జోన్ పరిధిలో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ వరకు 40 ఆక్రమణలు,
6 వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, అగనంపూడి జంక్షన్ నుండి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ వరకు 67 ఆక్రమణలు,
వెస్ట్ జోన్ పరిధిలో మల్కాపురం నుండి కోరమండల్ గేట్ వరకు 12 ఆక్రమణలు,
8వ జోన్ పరిధిలో వ్యాపకుంట జంక్షన్ నుండి చిన్న ముషిడివాడ జంక్షన్ వరకు 15 ఆక్రమణలతో కలిపి
మొత్తం 281 ఆక్రమణలు తొలగించడం అయినదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


