శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గణిత శాస్త్ర విభాగం
5/12/2025 వ తేదీన*The Role of Mathematics in AI*అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి Dr. R. Vijayakrishna గారు, Asst. Professor, SRM University ప్రధాన అతిథిగా విచ్చేశారు. Shri V. S. Pradeep గారు, Asst. Director, SRM University ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేశారు.
Dr. V. V. S. Kumar గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని Dr. P. V. DurgaVathi గారు,B.kiranmayi,K. Bhanupriya, Dr. Y. Praroopa, N. Jahnavi Devi తదితరులు విజయవంతంగా నిర్వహించారు.
ప్రధాన అతిథి గారు మాట్లాడుతున్న సందర్భంగా ప్రస్తుత కాలంలో గణిత శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత, అది ఎలా AI మరియు ML రంగాల్లో ఉపయోగపడుతుందో వివరించారు. గణిత శాస్త్రం ఆధారంగానే AI టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని అన్నారు.
Dr. P. V. DurgaVathi గారు మాట్లాడుతూ గణితం రాండమ్ ప్రాసెస్‌లను అర్థం చేసుకోవడంలో కీలకమని, AI లో డేటా విశ్లేషణలు, Machine Learning విధానాలు, ML–AI అప్లికేషన్లలో గణితం ఆధారమైనదని వివరించారు.
తదుపరి మాట్లాడుతూ డిజిటల్ విప్లవ కాలంలో AI అనువర్తనాల భవిష్యత్తు అవకాశాలపై కూడా చర్చించారు.


