
*కురవి అంగన్వాడీ టీచర్ బండారి ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*25-09-2026*కురవి:* డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్ బండారి ఉమ మహేశ్వరి గారు ఇటీవల మృతి చెందగా, *మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* నేడు వారి నివాసానికి చేరుకున్నారుఈ సందర్భంగా బండారి ఉమ మహేశ్వరి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు, మహేశ్వరి గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారుఈ కార్యక్రమంలో కురవి మండల బీఆర్ఎస్ నాయకులు ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీను నాయక్, బాదే నాగయ్య తదితరులు పాల్గొన్నారు

