అనపర్తి, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి):
శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘన విజయవంతమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పులగం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అనపర్తి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ & డిప్యూటీ కలెక్టర్ శ్రీ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం బలపడితేనే విద్యార్థుల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కారణం పిల్లల శ్రేయస్సు, భవిష్యత్ బలోపేతమని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆయన సూచించారు.
ఎంఆర్ఓ శ్రీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖల అందరి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు. మాక్ అసెంబ్లీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి జీవీవీ సతీష్ ను స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా అభినందించారు.
తదుపరి పాఠశాలలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ను ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆస్వాదించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ–II శ్రీ నల్లమిల్లి సత్తిరెడ్డి, మామిడి శెట్టిశ్రీను, ధర్మాసుల సతీష్, రాయి పెద్దిరాజు, లోవరాజు, శ్రీను, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.


