*వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్రతిని ఆవిష్కరించిన కలెక్టర్*
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి:- * విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, సౌకర్యార్థం తెలుగులో రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం-2016, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమావళి -2023 ప్రతులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో వారి హక్కులను కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్బంగా అధికారులకు సూచించారు. అనంతరం సంబంధిత ప్రతులను జిల్లా అధికారులకు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 03వ తేదీన వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు చెప్పారు. వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్రతుల ఆవిష్కరణలో ఆ శాఖ ఏడీ కె. కవిత, ఇన్ఛార్జి డీఆర్వో సత్తిబాబు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


