Monday, 18 May 2026
  • Home  
  • అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ .
- విశాఖపట్నం

అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ .

అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ . *రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోండి జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకరరావు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగరంలో 1985 నుండి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేయుటకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకర రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 1) Building Penalization Scheme (BPS) మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి, ప్రభుత్వం వారి జీవో ఎం.ఎస్.నెంబర్ 225 MA&UD (M) Dept., తేది..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/(urban Local Bodies) బిల్డింగ్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని, అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్స్, ఫ్లాట్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వము కల్పించిందని తెలిపారు. 1985 నుండి తేదీ 31-08-2025 మధ్య నిర్మించిన బిల్డింగ్స్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ,యుడిఏ, సిఆర్డీఏ, విఎంఆర్డీఏ, ఐఏఎల్ఎ పరిధిలో ఉన్నవారికి ఈ అవకాశం వర్తిస్తుందని, ప్రభుత్వ భూములు/ఎండోమెంట్స్/ సాగర్ / నది వాగు / ట్యాంక్ బెడ్, మాస్టర్ ప్లాన్ రోడ్/ ఓపెన్ స్పేస్ /పార్కు వినియోగించే భూములు, తేదీ 31-08-2025 తర్వాత కట్టిన నిర్మాణాలు, భూ వివాదం ఉన్నవాటికి అవకాశం లేదని తెలిపారు. వెబ్సైట్ www.bps.ap.gov.in ద్వారా రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ప్లాన్ ,బిల్డింగ్ ఫోటోలు, స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్, ఇండెమ్నిటీ బాండ్ తదితర పత్రాలు అప్ లోడ్ చేయాలని, స్థలం యొక్క కొలతలు, డివియేషన్ విస్తీర్ణం, ల్యాండ్ మార్కెట్ విలువ, అలాగే BPS అప్లై చేయుట కొరకు రూ.10,000 ముందస్తు చెల్లింపు తప్పనిసరని తెలిపారు. తేదీ 31-12-1997 లోపల ఉన్న భవనాలకు 25% , మురికి వాడల ప్రాంతాల నిర్మాణాలకు 50% తగ్గింపు ఉంటుందని, నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజుల్లోగా ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. 2)Land Regularization Scheme(LRS) అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020 ని సవరించిందని, G.O.Ms.No.10, MA&UD (M) Dept, తేదీ 01.01.2020. కటాఫ్ తేదీని పొడిగిస్తూ, 30.06.2025 కి ముందు రిజిస్టర్ చేయబడిన ప్లాట్లన్నింటినీ ఈ స్కీమ్ లో అవకాశము కల్పించిందన్నారు. తదుపరి ప్రభుత్వం G.O 134, MA&UD (M) Dept, తేదీ 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీగా సూచించి , మరలా తదుపరి జీవో RT .NO- 1173 MA&UD (M) Dept తేదీ 27- 10 -2025 కి పొడిగిస్తూ అవకాశాన్ని కల్పించడమైనదన్నారు . ఎల్ఆర్ఎస్ స్కీం లో స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించబడునని తెలియజేశారు. దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి LRS పోర్టల్ తేదీ 04.08.2025 నుండి అందుబాటులో ఉంచడమైనదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఇదే తుది అవకాశమని ప్రభుత్వ ఉత్తర్వుల లో పేర్కొన్నారని తెలిపారు.. కావున, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు, భవన నిర్మాణదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరని జీవీఎంసీ కమిషనర్ తరపున ఆయన తెలిపారు .

అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ .

*రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోండి

జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకరరావు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు
నగరంలో 1985 నుండి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేయుటకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకర రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

1) Building Penalization Scheme (BPS)

మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి, ప్రభుత్వం వారి జీవో ఎం.ఎస్.నెంబర్ 225 MA&UD (M) Dept., తేది..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/(urban Local Bodies) బిల్డింగ్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని, అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్స్, ఫ్లాట్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వము కల్పించిందని తెలిపారు.

1985 నుండి తేదీ 31-08-2025 మధ్య నిర్మించిన బిల్డింగ్స్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ,యుడిఏ, సిఆర్డీఏ, విఎంఆర్డీఏ, ఐఏఎల్ఎ పరిధిలో ఉన్నవారికి ఈ అవకాశం వర్తిస్తుందని, ప్రభుత్వ భూములు/ఎండోమెంట్స్/ సాగర్ / నది వాగు / ట్యాంక్ బెడ్, మాస్టర్ ప్లాన్ రోడ్/ ఓపెన్ స్పేస్ /పార్కు వినియోగించే భూములు, తేదీ 31-08-2025 తర్వాత కట్టిన నిర్మాణాలు, భూ వివాదం ఉన్నవాటికి అవకాశం లేదని తెలిపారు. వెబ్సైట్ www.bps.ap.gov.in ద్వారా రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ప్లాన్ ,బిల్డింగ్ ఫోటోలు, స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్, ఇండెమ్నిటీ బాండ్ తదితర పత్రాలు అప్ లోడ్ చేయాలని, స్థలం యొక్క కొలతలు, డివియేషన్ విస్తీర్ణం, ల్యాండ్ మార్కెట్ విలువ, అలాగే BPS అప్లై చేయుట కొరకు రూ.10,000 ముందస్తు చెల్లింపు తప్పనిసరని తెలిపారు. తేదీ 31-12-1997 లోపల ఉన్న భవనాలకు 25% , మురికి వాడల ప్రాంతాల నిర్మాణాలకు 50% తగ్గింపు ఉంటుందని, నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజుల్లోగా ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

2)Land Regularization Scheme(LRS)

అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020 ని సవరించిందని, G.O.Ms.No.10, MA&UD (M) Dept, తేదీ 01.01.2020. కటాఫ్ తేదీని పొడిగిస్తూ, 30.06.2025 కి ముందు రిజిస్టర్ చేయబడిన ప్లాట్లన్నింటినీ ఈ స్కీమ్ లో అవకాశము కల్పించిందన్నారు.

తదుపరి ప్రభుత్వం
G.O 134, MA&UD (M) Dept, తేదీ 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీగా సూచించి , మరలా తదుపరి జీవో RT .NO- 1173 MA&UD (M) Dept తేదీ 27- 10 -2025 కి పొడిగిస్తూ అవకాశాన్ని కల్పించడమైనదన్నారు . ఎల్ఆర్ఎస్ స్కీం లో స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించబడునని తెలియజేశారు. దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి LRS పోర్టల్ తేదీ 04.08.2025 నుండి అందుబాటులో ఉంచడమైనదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు.

ఇదే తుది అవకాశమని ప్రభుత్వ ఉత్తర్వుల లో పేర్కొన్నారని తెలిపారు.. కావున, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు, భవన నిర్మాణదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరని జీవీఎంసీ కమిషనర్ తరపున ఆయన తెలిపారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.