Wednesday, 23 September 2026
  • Home  
  • మావోయిజానికి ఇక నాలుగు నెలలు మాత్రమే” — హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కఠిన సందేశం ఇచ్చిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- తెలంగాణ

మావోయిజానికి ఇక నాలుగు నెలలు మాత్రమే” — హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కఠిన సందేశం ఇచ్చిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (తెలంగాణ పున్నమి ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం మావోయిజంపై యుద్ధస్ఫూర్తితో కొనసాగిస్తున్న చర్యల నేపథ్యంలో, హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నక్సలైట్లకు ఇక నాలుగు నెలలే మిగిలాయని, దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కాంప్రమైజ్ లేని ప్రభుత్వం’ మార్గదర్శకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ముందుండి మావోయిస్టులపై దృఢంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ కూమర్ అన్నారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే మార్చికల్లా మావోయిజం పూర్తిగా ముగుస్తుందని, ఇక ప్రభుత్వ ధోరణిలో ఎలాంటి సడలింపు ఉండదని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అర్బన్ నక్సల్స్ పేరుతో నగరాల్లో సురక్షితంగా ఉంటూ, పేద యువకులను అడవుల్లోకి తోసే వ్యక్తులే అసలు దేశద్రోహులని వ్యాఖ్యానించారు. నిరపరాధుల మరణాలకు వారికి బాధ్యత ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్ పేర్కొన్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(తెలంగాణ పున్నమి ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం మావోయిజంపై యుద్ధస్ఫూర్తితో కొనసాగిస్తున్న చర్యల నేపథ్యంలో, హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కీలక ప్రకటన చేశారు.

నక్సలైట్లకు ఇక నాలుగు నెలలే మిగిలాయని, దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కాంప్రమైజ్ లేని ప్రభుత్వం’ మార్గదర్శకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ముందుండి మావోయిస్టులపై దృఢంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ కూమర్ అన్నారు.

నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
వచ్చే మార్చికల్లా మావోయిజం పూర్తిగా ముగుస్తుందని, ఇక ప్రభుత్వ ధోరణిలో ఎలాంటి సడలింపు ఉండదని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

అర్బన్ నక్సల్స్ పేరుతో నగరాల్లో సురక్షితంగా ఉంటూ, పేద యువకులను అడవుల్లోకి తోసే వ్యక్తులే అసలు దేశద్రోహులని వ్యాఖ్యానించారు. నిరపరాధుల మరణాలకు వారికి బాధ్యత ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.