– మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నా.మోహన్ రెడ్డి
కామారెడ్డి,17 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలు పు కోసం కార్యకర్తలు గ్రామ గ్రామాన పోరాట బాట పట్టాలని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నా.మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రె స్ విజయాలను సాధించింది. అదే స్పూర్తితో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.
రెడ్డిపేట తండాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వక్తిగత, భేషజాల విభేదాలకు తావు లేకుండా పార్టీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు, రైతులకు రెండేళ్లలో రెండు లక్షల రుణమాఫీ, రూ.500కు గ్యాస్, ఉపాధ్యాయ నియామకాలు, మహిళా బలోపేతం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గుర్తింపు ఖాయం అని అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, సల్మాన్, కుమ్మరి శంకర్, గంగావత్ రవి నాయక్, ఇర్షద్, దయానంద్, గంగావత్ బోజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


