* సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ఊహించిన దాని కంటే విజయవంతం అయింది— వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్.
* ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఆంధ్రపదేశ్. ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతున్నారు.
* సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు.
* పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు బయపడుతున్నారు.
* దీంతో రాష్ట్ర ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
* కోడిగుడ్డు మంత్రి గా పేరొందిన అమర్ నాథ్ గారు మీరు ఐదు ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
* దేశ విదేశాలు తిరిగి పెద్ద ఎత్తున పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కష్టపడ్డారు. దీని ఫలితమే సదస్సు విజయవంతం అయింది.
* మీ హాయంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అద్దె కోట్లు, నకిలీ సంస్థలతోనే మీకు ఒప్పందాలు జరిగాయి. అందుకే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు.
* రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ ను హైటెక్ సిటీని అభివృద్ధి చేయగా, నేడు విశాఖను గూగుల్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నారు.
* కూటమి ప్రభుత్వం లో సదస్సులో మావి నిజమైన లెక్కలు… అమర్నాథ్ గారి హయంలో సదస్సులో కోడిగుడ్డు కథలు వినిపించారు.
* జగన్ హయంలో పెట్టుబడి మ్యాప్‌లో నుంచి ఆంధ్రపదేశ్ మాయమైంది.
* మా మీద ఆరోపణలు పెట్టే ముందు వైసీపీ హయంలో వచ్చిన కంపెనీలు చూపించండి.
* స్టేజ్‌పై కూర్చోబెట్టడం కాదు… పెట్టుబడులు రప్పించడం అనేది మాత్రమే మాకు తెలుసు.
* విశాఖ అభివృద్ధి అనే మాట వైసీపీ నేతల నోటి నుంచి వస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు.
* కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేదు ఇటు పెట్టుబడిదారులు కూడా నమ్మలేదు.
* విశాఖ లో జరిగిన సదస్సలో 613 ఒప్పందాలతో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి.


