కామారెడ్డి, 15నవంబర్, ( పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, స్థానిక కాలభైరవ స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాల కు హాజరైన భక్తురాలు మేకల సాయి సురేఖ (బాన్సువాడ) తన పర్స్‌ను అనుకోకుండా కోల్పో యింది. ఆపర్స్‌లో రూ.20,000 నగదు, గుర్తింపు తప్పనిసరి పత్రాలు ఉన్నట్టు తెలిపింది.అదే సమ యంలో ఉత్సవాల కోసం ఆలయానికి వచ్చిన కందూరి గ్రామానికి చెందిన పెద్ధ లక్ష్మీకి ఆ పర్స్ దొరికింది. ఆమె ఏ ఆలోచన లేకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పర్స్‌ను అప్ప గించింది.ఈ విషయం తెలుసుకున్న సబ్ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆమె నిజాయితీని మెచ్చుకొని పోలీస్ స్టేషన్లో సన్మానించారు. ప్రజా విశ్వాసాన్ని నిల బెట్టిన లక్ష్మీ వంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శమ ని పోలీసులు అభినందించారు.


