స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం చిరస్మరణీయుడు .
ఉక్కు కార్మిక సంఘాల ఘన నివాళి
విశాఖపట్నం , నవంబర్ 10 (పున్నమి ప్రతినిధి).
విశాఖపట్నం లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం అని విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలు కొనియాడారు . సోమ వారం ఉక్కు నగరం సెక్టార్ 9 తెన్నేటి పార్కులో స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ఎంపీ స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం 46 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెన్నేటి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తెన్నేటి విశ్వనాథం చేసిన కృషి మరువ రాని దన్నారు . ఆయన చేసిన కృషి నీ ఉక్కు కార్మిక వర్గం ఎన్నటికీ మరువదని అన్నారు . ఈ కార్యక్రమం లో స్టీల్ ప్లాంట్ ఏ.ఐ.టి.యూ సి ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ , ఐ. ఎన్.టి.యూ సి అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి , సి.ఐ.టి.యూ ప్రధాన కార్యదర్శి జె.అయోధ్య రామ్ , హెచ్.ఎం ఎస్ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు , నాయకులు టి.ఎస్. ఎన్. పుల్లా రావు తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

