మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక అడుగు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు నూతన ఊపునిచ్చింది NHAI. మొదటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ, తొలిదశలో 9 గ్రామాల్లో 1,173 ఎకరాల భూమి సేకరణ ప్రారంభమైంది. రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం న్యాయమైన పరిహారం అందించనున్నారు. 189.4 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో రూపొందే ఈ రోడ్డు అమరావతిని గుంటూరు, విజయవాడ, తెనాలి అర్బన్ క్లస్టర్‌లతో అనుసంధానం చేస్తుంది. రూ.24,791 కోట్ల వ్యయంతో గ్రీన్ హైవేగా అభివృద్ధి చెందనున్న ఈ ప్రాజెక్టు 12 ప్యాకేజీలుగా విభజించబడింది. 2019లో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది.


