(పున్నమి)దుత్తలూరు నవంబర్ 7న
దుత్తలూరు మండలంలోని కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ అడివి పేరంటాలమ్మ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబాలు గా నిలుస్తాయని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామీణ ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తజనులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


