పున్నమి రిపోర్టర్ మురళి నెల్లూరు బ్యూరో నెల్లూరు నవంబర్ 2
పవిత్ర కార్తీక మాసం నేపధ్యంలో శివ పార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ సహకారంతో నిర్వహిస్తున్న కార్తిక మాస మహా రుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మహారుద్రాభిషేకం తిలకించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహకారంతో ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్తిక మాసంలో శివుడికి చేసే అభిషేకాలు మనకు ఎప్పుడు ప్రశాంతతను ఇస్తాయనీ, మన హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. శివుడికి, మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసమని చెప్పారు. మహా రుద్రాభిషేకం సందర్భంగా మహా శివుని ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకర్షించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌ను అభినందించారు. అలాగే ఈ నెల 6, 7, 8 తేదీల్లో మా VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక మాస లక్ష్య దీపోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


