Thursday, 5 March 2026
  • Home  
  • మొంథా తుఫాన్ ప్రభావితులకు సహాయం – పెందుర్తిలో సహాయక కార్యక్రమం
- విశాఖపట్నం

మొంథా తుఫాన్ ప్రభావితులకు సహాయం – పెందుర్తిలో సహాయక కార్యక్రమం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీ ఆయిల్ సీడ్ చైర్మన్ గండి బాబ్జి పాల్గొన్నారు. ఈరోజు (31.10.2025) పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు, మహిళా ప్రగతి కేంద్రం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావిత ఏకలవ్య కాలనీ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు నగదు సహాయం అందజేశారు. ఒక కుటుంబానికి గరిష్టంగా ₹3,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సందర్భంలో పంపిణీ చేయబడింది. పత్రికా మిత్రులతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు తెలిపారు: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా 24×7 మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సమన్వయంతో పనిచేసినందున తక్కువ నష్టం జరిగిందన్నారు. ముందస్తు జాగ్రత్తల వల్లే ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢసంకల్పం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతర సమీక్షల వల్ల భారీ విపత్తును ఎదుర్కోవడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్ని విభాగాల్లో అంచనాలు జరుగుతున్నాయని, నివేదిక త్వరలో కేంద్రానికి అందజేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ శంకరరావు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాసరావు, సేనాపతి శంకరరావు, ముమ్మన దేవుడు, బీజేపీ ఇన్‌చార్జ్ గొర్లి రాము నాయుడు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోరపిల్లి సోము నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, ఉరిటి గోవింద్, సంతోష్, ముమ్మన సతీష్, గొంతిన హైమవతి, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, మండల పార్టీ అధ్యక్షుడు కొరుపోలు రాము నాయుడు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు, కంచిపాటి మధు, రాజేంద్ర ప్రసాద్, పిన్నింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండలంలోని ఎన్‌డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీ ఆయిల్ సీడ్ చైర్మన్ గండి బాబ్జి పాల్గొన్నారు.

ఈరోజు (31.10.2025) పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు, మహిళా ప్రగతి కేంద్రం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావిత ఏకలవ్య కాలనీ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు నగదు సహాయం అందజేశారు. ఒక కుటుంబానికి గరిష్టంగా ₹3,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సందర్భంలో పంపిణీ చేయబడింది.

పత్రికా మిత్రులతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు తెలిపారు:

మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా 24×7 మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సమన్వయంతో పనిచేసినందున తక్కువ నష్టం జరిగిందన్నారు.

ముందస్తు జాగ్రత్తల వల్లే ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢసంకల్పం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతర సమీక్షల వల్ల భారీ విపత్తును ఎదుర్కోవడం సాధ్యమైందని తెలిపారు.

రాష్ట్ర ప్రజల తరఫున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్ని విభాగాల్లో అంచనాలు జరుగుతున్నాయని, నివేదిక త్వరలో కేంద్రానికి అందజేయనున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ శంకరరావు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బల్ల శ్రీనివాసరావు, సేనాపతి శంకరరావు, ముమ్మన దేవుడు, బీజేపీ ఇన్‌చార్జ్ గొర్లి రాము నాయుడు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోరపిల్లి సోము నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, ఉరిటి గోవింద్, సంతోష్, ముమ్మన సతీష్, గొంతిన హైమవతి, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, మండల పార్టీ అధ్యక్షుడు కొరుపోలు రాము నాయుడు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు, కంచిపాటి మధు, రాజేంద్ర ప్రసాద్, పిన్నింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి మండలంలోని ఎన్‌డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.