నంద్యాల పట్టణంలోని 26,27వ వార్డులలో మోంత తుఫాన్ తీవ్రత వల్ల వరద ముంపు ప్రాంత ప్రజలు పలుచోట్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి నంద్యాల వాస్తవ్యులై ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ నంద్యాల ప్రాంతంలో వరద మంపు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని వెంటనే తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న. అనే నినాదంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే మనసున్న వ్యక్తిగా ఆయన ఒక మంచి పేరు అందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని స్థానిక 26,27వ వార్డు దేవనగర్,శ్యామ్ నగర్ లో వరద ముంపు వల్ల తీవ్ర ఇబ్బంది గురవుతున్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి అన్నదాన వితరణ చేయాలని అటువంటి ముఖ్య ఉద్దేశం తోటి ఈరోజు దాదాపు 400కు పైగా దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను మరియు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇంత మంచి కార్యక్రమంలో నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబులు తో పాటు 26,27 వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయిన మల్లెల భాస్కర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొని వార్డులలోని వరదల వల్ల ఇబ్బందుల గురైనటువంటి కుటుంబాలను గుర్తించి ప్రతి ఇంటికి దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను చేర్చాలని తమ వార్డు లోని వరద ముంపుకు గురైన ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో వరదల వల్ల తీవ్ర ఇబ్బందికి గురైన కొన్ని కుటుంబాల వారు మాట్లాడుతూ ఈ విధంగా తమకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆహార ప్యాకెట్లను,నీటిని మా ఇంటి వద్దకు వచ్చి అందించడం వల్ల చాలా సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ రాంబాబులు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాజకీయ, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరి బాథ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ తమ వంతు సహాయంగా నేడు 26, 27 వ వార్డు వరద ముంపుకు గురైన బాథిత ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.గోళ్ల రాజేష్ వారు వ్యాపార రిత్యా అందుబాటులో లేకపోయినప్పట్టికి నంద్యాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై గోళ్ల రాజేష్ ను జనసేన పార్టీ నాయకులు అభినందించారు. అదేవిధంగా గతంలో నుంచి కూడా నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు సహాయం అందించే సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఎప్పుడు తాము తోడుగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు రిపోర్టర్ నూర్ భాషా మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబు లకు మరియు 26, 27వ వార్డులు దేవ నగర్, శ్యాంనగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భాస్కర్ కు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు. తమ వార్డులో ఈ విధంగా ఆహార పంపిణీ కార్యక్రమం ఉందని అందుకు మీరు రావాలని పిలవగానే తమకు ఎన్నో కార్యక్రమాలు,పనులు ఉన్నప్పటికీ పిలవగానే ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు,సుందర్, రాంబాబులకు,తెలుగుదేశం పార్టీ 26,27వ వార్డు ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కార్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నూర్ బాష మాట్లాడుతూ గతంలో నుంచి కూడా ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ వారు కొన్ని వ్యాపార కారణాలవల్ల ఇక్కడికి రాలేకపోయారని అయినా కూడా నంద్యాల వాసి అయిన గోళ్ల రాజేష్ నంద్యాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బంది గురవుతున్న ప్రజలకు తనవంతు సహాయంగా అన్నదాన వితరన కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు తన ద్వారా చేయించడంపై నూర్ భాషా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భగవంతుడు గొళ్ల రాజేష్ కి అన్ని విధాల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు ఎల్లప్పుడూ తన వంతు బాధ్యతగా ఆయన వెంట ఉంటామని మీడియా మిత్రులు రిపోర్టర్ నూర్ భాషా తెలిపారు ఈ కార్యక్రమంలో సవారి,చిన్న,రవి, సంజీవరాయుడు,శివశంకర్,విజయ్,షాలీ,అల్తాఫ్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


