Thursday, 5 February 2026
  • Home  
  • పిపిపి విధానం వల్ల పేద ప్రజలకు వైద్య విద్యా దూరం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిపిపి విధానం వల్ల పేద ప్రజలకు వైద్య విద్యా దూరం

ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పిపిపి విధానం వల్ల పేద ప్రజలకు, విద్యార్థులకు విద్యా వైద్యం దూరమవుతాయని సీతారామపురం మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం సీతారామపురం బస్టాండ్ సెంటర్లో మండల మాజీ ఉపాధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణం రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచే ధోరణిలో కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు. పిపిపి విధానం వల్ల కూటమి పెద్దల జేబులు నిండుతాయే గాని పేద ప్రజలకు వైద్య విద్య దూరం అవుతూ ఖర్చు లేని నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రమంతటా ప్రజలందరూ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీకి బాసటగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు వదులుకున్నామా అని ప్రస్తుతం చింతిస్తున్నారన్నారు. అనంతరం ఇటీవల మరణించిన నారాయణమ్మ పేట గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు రమణయ్య కుటుంబాన్ని, అదేవిధంగా ఇటీవల గుండె నొప్పితో మరణించిన బట్టల వ్యాపారస్తుడు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, వైసీపీ నాయకులు గుండ్లపల్లి తిరుపాలు, చింతం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కనమర్లపూడి పవన్, ఎస్. నారాయణరాజు, షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.