Wednesday, 1 April 2026
  • Home  
  • ఇన్‌కమింగ్‌ కాల్‌లోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు – మార్చి నాటికి కొత్త ఫీచర్‌ అందుబాటులోకి!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇన్‌కమింగ్‌ కాల్‌లోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు – మార్చి నాటికి కొత్త ఫీచర్‌ అందుబాటులోకి!

ఇకపై ట్రూకాలర్‌ వంటి యాప్‌ల అవసరం లేకుండానే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే, ఆ వ్యక్తి పేరు తెలుసుకోవడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, టెలికాం కంపెనీలు కొత్త సర్వీస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఫోన్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డు (KYC)లో ఉన్న పేరునే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలో ప్రదర్శించే విధంగా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇకపై ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎటువంటి యాప్‌ అవసరం లేకుండా, ఫోన్‌ స్క్రీన్‌పైనే కాలర్‌ పేరు కనిపించనున్నది!

ఇకపై ట్రూకాలర్‌ వంటి యాప్‌ల అవసరం లేకుండానే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలోనే కాల్‌ చేస్తున్న వ్యక్తి పేరు మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి కాల్‌ వస్తే, ఆ వ్యక్తి పేరు తెలుసుకోవడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా, టెలికాం కంపెనీలు కొత్త సర్వీస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఫోన్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డు (KYC)లో ఉన్న పేరునే ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలో ప్రదర్శించే విధంగా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇకపై ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎటువంటి యాప్‌ అవసరం లేకుండా, ఫోన్‌ స్క్రీన్‌పైనే కాలర్‌ పేరు కనిపించనున్నది!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.